Mobile Popup Ad
Mobile Popup Ad

రాజకీయ ప్రయోజనాలు కాదు… రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. రేవంత్ దగ్గర సమాధానం లేనప్పుడు తిట్టు అందుకుంటారని ఆరోపించారు. తమను తిట్టినా ప్రశ్నించడం ఆపబోమని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదు… తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించారు.

నదుల అనుసంధానంలో తమకు అన్యాయం జరగవద్దని మాత్రమే పోరాటం చేస్తున్నట్లు హరీశ్ రావు అన్నారు. గోదావరి – బనకచర్లపై బీఆర్ఎస్ పోరాడితేనే ఆగిందని చెప్పారు. అయితే గతంలో కృష్టా నది, ఇప్పుడు గోదావరిపై ద్రోహం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం అయిందని మండిపడ్డారు. చంద్రబాబు కోసం రాష్ట్రానికి ద్రోహం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్నారని ఆరోపించారు. గురుదక్షిణగా నీళ్లు ఇవ్వాలని అనుకుంటున్నారని.. అందుకే గోదావరి – నల్లమల్ల సాగర్ అంటున్నారని చెప్పారు. పోలవరం నుంచి గోదావరి నీళ్లు మళ్లించాలని చూస్తున్నారని వెల్లడించారు.

అయితే గోదావరిలో అసలు సర్ ప్లస్ వాటర్ లేనేలేదని.. మిగులు జలాలు లేనప్పుడు ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించామని పేర్కొన్నారు. తమ హయాంలో నదుల అనుసంధానికి కొన్ని ప్రతిపాదనలు పెట్టామని గుర్తు చేశారు. ఇచ్ఛంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలని కోరామన్నారు. అప్పుడు తెలంగాణ మనం కూడా గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ భూభాగం నుంచే నీళ్లు తీసుకోవాలని కర్నాటక కూడా ఒప్పుకుందని.. తమ కేటాయింపులు వాడుకున్నాక నీళ్లు తీసుకోవాలని చెప్పామన్నారు. కావేరీకి తీసుకెళ్లే నీళ్లలో సగం మాకు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలకు కేంద్రం కూడా అంగీకరించిందని వెల్లడించారు.

అయితే ఏపీ సీఎం చంద్రబాబు కావేరీ – గోదావరి లింక్ అంటున్నారని హరీశ్ రావు అన్నారు. పోలవరం నుంచి గోదావరి నీళ్లు మళ్లించాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే పోలవరం నుంచి నీళ్లు మళ్లిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. చంద్రబాబు కోసం రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తుంటే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>