కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గూండాలను పంపించి దాడి చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. హకీంపేట వద్ద ఆయన్ను అరెస్ట్ చేసిన మేడ్చల్ మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో హరీశ్ రావు మాట్లాడుతూ.. కొంత మంది తప్ప తాగి కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్తుంటే.. పోలీసులే ఎస్కార్ట్ ఇవ్వడమేంటన్నారు. హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డినే ఈ దాడికి ప్రణాళిక రూపొందించారని ఫైర్ అయ్యారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ స్పందించాలి..
దేశమంతా రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అప్రజాస్వామిక చర్యలు కనిపించడం లేదా.. అని హరీశ్ రావు ప్రశ్నించారు. అసోం ముఖ్యమంత్రి నీ పుట్టుకను ప్రశ్నిస్తే.. రాహుల్ గాంధీకి అప్పుడు కేసీఆర్ మద్దతుగా నిలిచారన్నారు. అలాంటి వ్యక్తి ఇంటి మీదకి సొంత పార్టీ సీఎం గూండాలను పంపుతుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. ఎమ్మెల్యే వీర్ల శంకర్ కేసీఆర్ చావాలని కోరుకుంటున్న అని బహిరంగంగా మాట్లాడుతున్నాడని, దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. అసలు కేసీఆర్ రాష్ట్రం సాధించకపోతే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా.. అని ప్రశ్నించారు.

