Mobile Popup Ad
Mobile Popup Ad

‘మూసీ’ డీపీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టండి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. ఈ అంశంపై కేటీఆర్ (KTR)  బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నదని ఆరోపించారు. ‘57 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మేము ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి సభలో చెప్పారు. అది నిజమని చెప్తే నేను రాజీనామా చేస్తాను. సభలో మూసీపై మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఏడీబీ రుణం ఇచ్చింది అంటున్నారు. డీపీఆర్ పూర్తయింది. ఆరు నూరైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ఓ అధికారి అంటున్నాడు. అసలు అధికారి ఎవరు ఈ ప్రకటన చేయడానికి’ అంటూ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు.

‘కుక్క తోకను ఊపుతుందా…. తోక కుక్క‌ను ఊపుతుందా?’ అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. మూసీ ప్రాజెక్టు వ్యవహారంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి’ అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>