Mobile Popup Ad
Mobile Popup Ad

బాచుప‌ల్లి ఫ్లైఓవ‌ర్ ప‌నుల‌పై కేటీఆర్ విమ‌ర్శ‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌లోని బాచుప‌ల్లిలో జ‌రుగుతున్న ఫ్లైఓవ‌ర్ ప‌నుల‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమ‌ర్శ‌లు చేశారు. ఫ్లై ఓవ‌ర్ ప‌నులు జ‌రుగుతున్న తీరును వీడియో తీసి ఓ యువ‌కుడు ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశాడు. వీడియోలో ఎలాంటి భద్ర‌తాప‌ర‌మైన‌ జాగ్ర‌త్త‌లు లేకుండా ప‌నులు చేస్తున్నార‌ని పేర్కొన్నాడు. దీనికి మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌, కేపీ వివేకానంద్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ను ట్యాగ్ చేశాడు. ఈ వీడియోను కేటీఆర్ రీపోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్రజల భద్రత గురించి పట్టించుకునే వారు ప్రభుత్వంలో ఎవరూ లేరా? అని ప్ర‌శ్నించారు. మున్సిపల్ శాఖ అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంద‌ని విమ‌ర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>