Mobile Popup Ad
Mobile Popup Ad

పుష్కర తెలంగాణ ముష్కరుల తెలంగాణగా మారింది: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) సంబరాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను కేటీఆర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. గత ప్రభుత్వంపై, కేసీఆర్ పై చిల్లర ప్రచారాలు చేసి, అబద్ధాలతో కూడిన విష ప్రచారాలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో 420 హామీల రూపంలో చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని మండిపడ్డారు. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసిందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ విష ప్రచారాల వల్లే BRS ఓటమి..

దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్.. తెలంగాణకు వచ్చిందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాడైనా ఒంటరిగానే పోటీ చేసిందని, ఒంటరిగానే గెలిచిందని కొనియాడారు. కాంగ్రెస్ విష ప్రచారాల వల్లనే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని చెప్పారు. గెలుపుతో పొంగిపోయేది లేదని.. ఓడితే కుంగిపోయేది లేదు అన్న కేసీఆర్ మాటలను బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా స్ఫూర్తిగా తీసుకుంటుంన్నామని అన్నారు. అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 25 ఏళ్ల వెనక్కి నెట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వర్ణించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చంపిన విస్తరిగా చేస్తున్నాడని మండిపడ్డారు.

అన్ని రంగాల్లో కుప్పకూలిన రాష్ట్రం..

సరిగ్గా సగం సమయం అయిపోయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేవలం 30 నెలల్లో తెలంగాణను అన్ని రంగాల్లో కాంగ్రెస్ కుప్పకూల్చిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదని,. సంతోషంగా సాగిన వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రైతుబంధు లేదు, ఎరువుల ఇచ్చేటోళ్ళు లేరు, చివరికి పండించిన పంట రెండు నెలలైనా కొనే దిక్కు లేదు అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్యం చూస్తుంటే బాధ అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో ఈరోజు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ని బద్నామ్ చేయాలన్న ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పగబట్టిందని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలను గురువుకి సంతర్పణ చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>