కలం, వనపర్తి: 90 శాతం శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పారిశ్రామికవేత్తగా ఎదిగి పలువురు దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత చంద్రకాంత్ సాగర్‌ను మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో చంద్రకాంత్ సాగర్ వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ సహకారంతో చంద్రకాంత్ సాగర్ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు లభించిందని ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎదగడమే కాకుండా, ఇతర దివ్యాంగులకు ఉపాధి కల్పించడం స్ఫూర్తిదాయకమని కేటీఆర్, నిరంజన్‌రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ సాగర్ స్థాపించిన స్వయంకృషి ఫౌండేషన్ లోగోను కేటీఆర్, నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వారు ఆత్మీయంగా మాట్లాడుకుని కలిసి భోజనం చేశారు.

