కలం, బైంసా : భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో (Bhainsa Grievance Day) జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కుటుంబ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు షీ టీం సిబ్బందితో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భైంసాలోనే కౌన్సెలింగ్ సదుపాయం కల్పించడంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత గ్రీవెన్స్ డేలలో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించిన ఎస్పీ బాధితులకు త్వరగా న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ పాల్గొన్నారు.

