జ్ఞాపకాలను పదిలం చేసేది.. ఫోటో: డిప్యూటీ మేయర్

కలం, కరీంనగర్ బ్యూరో: అందమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, వెలకట్టలేని దృశ్యాలను పదికాలాలపాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేదే ఫోటోగ్రఫీ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) అన్నారు. కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో రవివర్మ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉందని అన్నారు.

మధురస్మృతులను ఎప్పటికీ జీవితకాలం గుర్తుండేలా చేసేవాళ్ళు, సమాజాన్ని జాగృతం పరిచే వాళ్ళు ఫోటోగ్రాఫర్లని సునీల్ రావు కొనియాడారు. చరిత్రను చాటి చెప్పేది.. చరిత్ర ఆనవాళ్లు కాపాడేది ఫోటోలు, ఫోటోగ్రాఫర్స్ అని అన్నారు. జిల్లాలోని ఫోటో, వీడియో గ్రాఫర్స్ అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాలిపెల్లి రవివర్మ, విరాట్, మహేష్, మణి తేజ, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>