కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ (OSD Sumanth) తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఆయన ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిశీలించగా, ఆయన 40 నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు. వెంటనే స్పందించిన కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>