రాష్ట్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: సాయిని మల్లేశం

కలం, కరీంనగర్: తెలంగాణ తొలి ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం (Saini Mallesham) కొనియాడారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సాయిని మల్లేశం పూలమాలలు వేసి నివాళి అర్పించి మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమ సారథి అని, 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో నింపారన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవిని, శాసనసభ్యత్వాన్ని కూడా తృణప్రాయంగా త్యాగం చేసిన నిబద్ధత కలిగిన నాయకుడు అని కొనియాడారు. చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు , ఆకాంక్షలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు సంపత్ రావు, గుర్రాల వెంకటరెడ్డి , గుజ్జ శ్రీనివాసరావు , కరివేద మహిపాల్ రెడ్డి ఆడిచర్ల రాజు, గుంజేటి శివ , శీలం శ్రీనివాస్ , జీడి మల్లేశం, కార్పొరేటర్ పెద్దపెల్లి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>