కలం, నిర్మల్ : ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ పట్టణంలోని నిర్మల్ – మంచిర్యాల రోడ్డులో చౌరస్తా వద్ద ఉన్న పోరాట వీరుడు కొమురం భీమ్ విగ్రహానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం ఎందరో అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. జల్, జంగల్, జమీన్ హక్కుల సాధన కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆదివాసీ సమాజానికి పోరాట యోధుడు స్ఫూర్తిదాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆదివాసీ సంఘాల నాయకులు, పాల్గొన్నారు.

