కలం, నిర్మల్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, నాయకులు శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

