పెండపల్లిలో కార్డన్‌ సెర్చ్‌.. 70 బైక్ లు, 3 ఆటోలు స్వాధీనం

కలం, భైంసా రూరల్: భైంసా (Bhainsa) రూరల్ మండలం పెండపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ (Cordon and Search) ఆపరేషన్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో గ్రామంలోని 70 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోల పత్రాలను పరిశీలించారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.

అనంతరం గ్రామస్థులతో సమావేశమైన ఏఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమన్నారు. సైబర్‌ నేరాలు, ఆన్లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రహదారి భద్రతా నియమాలు పాటించాలని, గంజాయి అక్రమ రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు.

పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా (Bhainsa) రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్‌, ఎస్సై సుప్రియ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>