ఖమ్మం గిరిజన ప్రాంతాలకు మొబైల్ వైద్య సేవలు

కలం, ఖమ్మం బ్యూరో: గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా కీలక సమావేశం జరిగింది. జిల్లాలో మొబైల్ మెడికల్ యూనిట్ సేవల విస్తరణ (MMU Services)పై SBI ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ పి. రామారావును కలిసి విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో SBI ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు రాంకీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శరామిరెడ్డి, హేమంత్ కుమార్, డాక్టర్ విజయ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సింగరేణి మరియు కామేపల్లి మండలాల్లోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వారు వైద్య సేవలు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రతినిధులు DMHO దృష్టికి తీసుకెళ్లారు.

ఆయా మండలాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే ఖమ్మం జిల్లాలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు మరిన్ని క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ​మరోవైపు కొణిజర్ల మండలంలో SBI ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికల్ సేవలను DMHO డాక్టర్ పి. రామారావు ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ సంస్థలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>