ప్రకృతి ఒడిలో విద్యార్థినులు: అలరించిన పులిగుండాల ట్రెకింగ్!

కలం, ఖమ్మం బ్యూరో: ప్రకృతి ఒడిలో సేదదీరుతూ, పర్యావరణంపై అవగాహన పెంచుకునేందుకు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఒక మంచి వేదికగా నిలిచింది. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఖమ్మం సోషల్ వెల్ఫేర్ పాఠశాల బాలికలకు పులిగుండాల ఎకో టూరిజం (Puligundala Eco Tourism ) ప్రాజెక్ట్‌కు ఒకరోజు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు ఏర్పాటు చేసిన ట్రెకింగ్ విద్యార్థినులను విశేషంగా అలరించింది.

​అటవీ శాఖ పర్యవేక్షణలో సాగిన ఈ ట్రెకింగ్‌లో బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పులిగుండాల ఎకో ప్రాజెక్ట్ విశిష్టతను, అడవుల్లో ఉండే వివిధ రకాల మూలికలు, మొక్కలు, అటవీ జంతువుల ప్రాధాన్యతను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి, అటవీ మృగాల మనుగడకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో తెలిపేందుకు పర్యావరణ స్పృహపై ప్రత్యేక అవగాహన కల్పించారు.

​మనం నివసిస్తున్న ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంత సందర్శనకు వెళ్లినప్పుడే అక్కడ ఉన్న విశేషాలు, సాంస్కృతిక ప్రాధాన్యం తెలుస్తాయని, అదే టూరిజం అంతరార్థమని అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి ప్రకృతి పర్యటనలు విద్యార్థులకు ఎంతగానో మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా చదువులో ఏకాగ్రతను పెంచేందుకు దోహదపడతాయని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, తల్లాడ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉమ, సెక్షన్ ఆఫీసర్ కవిత, బీట్ ఆఫీసర్ కేశవరావు, సోషల్ వెల్ఫేర్ పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>