కలం, నిర్మల్ : ఉట్నూర్ లో నిర్వహించిన రాథోడ్ సుమన్ భాయి, ఉత్తమ్ దంపతుల పదవీ విరమణ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) హాజరై వారికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన దంపతులను శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
తన విద్యార్థి దశలో ఉత్తం గురువుగా అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని గుర్తుచేసుకున్నారు. గురువుగా ఉత్తం అందించిన విలువైన సూచనలు, బోధనలు ఇప్పటికీ తనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. గురుశిష్యుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవీ విరమణ అనంతరం దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

