Mobile Popup Ad
Mobile Popup Ad

ఫామ్‌హౌస్ వీడనున్న కేసీఆర్.. త్వరలో బస్సుయాత్రకు సిద్ధం!

కలం, వెబ్ డెస్క్: గత ఎన్నికల్లో పరాజయం అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాలు ఉన్నప్పుడే బయటకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు (Bus Yatra) శ్రీకారం చుట్టేందుకు ముమ్మరంగా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ఈ యాత్ర సాగనుంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మళ్లీ మమేకమై, పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ వ్యూహాత్మక అడుగులు వేయబోతున్నారు. కేసీఆర్ బస్సు యాత్రపై అటు బీఆర్ఎస్, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>