Mobile Popup Ad
Mobile Popup Ad

జస్పాల్ రాణా మృతి.. దేశానికి తీరని లోటు: అమిత్ షా

కలం, స్పోర్ట్స్: భారత షూటింగ్ దిగ్గజం, ప్రముఖ కోచ్ జస్పాల్ (Amit Shah) రాణా శుక్రవారం కన్నుమూశారు. 49 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడంతో దేశ క్రీడా రంగం విషాదంలో మునిగిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన మరణాన్ని దేశానికి తీరని లోటుగా అభివర్ణించారు. జస్పాల్ రాణా భారత షూటింగ్‌కు ఎన్నో అంతర్జాతీయ విజయాలు అందించారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడలు, 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు అర్జున అవార్డు, పద్మశ్రీ కూడా లభించాయి.

క్రీడాకారుడిగా విజయవంతమైన కెరీర్ అనంతరం కోచ్‌గా మారిన రాణా (Jaspal Rana), భారత పిస్టల్ షూటింగ్ అభివృద్ధికి కీలకంగా నిలిచారు. ఒలింపిక్ పతక విజేత మను భాకర్ సహా పలువురు స్టార్ షూటర్లను తీర్చిదిద్దారు. కోచింగ్‌లో విశిష్ట సేవలకు 2020లో ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. అమిత్ షా తన సంతాప సందేశంలో, రాణా దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టారని, యువ షూటర్లను తయారు చేసి భారత షూటింగ్‌కు కొత్త దిశ చూపారని పేర్కొన్నారు.

ఆయన మృతిపై పీటీ ఉషా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గౌతమ్ గంభీర్, అభినవ్ బింద్రా తదితరులు సంతాపం తెలిపారు. భారత షూటింగ్ ఎదుగుదలలో జస్పాల్ రాణా పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. జస్పాల్ రాణా మరణం భారత క్రీడా ప్రపంచానికి పెద్ద లోటుగా మిగిలింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>