Mobile Popup Ad
Mobile Popup Ad

ఎర్రవెల్లిలో BRS కీలక సమావేశం: గులాబీ బాస్‌ దిశానిర్దేశం!

కలం, వెబ్‌ డెస్క్‌ : భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో ఈ భేటీ జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా కీలక నేతలు జీవన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు.

ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు వంటి కీలక అంశాలపై నాయకులకు కేసీఆర్ (KCR) మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. కీలక నేతలందరూ ఒకేచోట చేరడంతో రాజకీయ వర్గాల్లో ఈ సమావేశం ఆసక్తి రేపుతోంది.

Read Also:  నీట్ పరీక్ష రద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>