బ్రహ్మోత్సవాలకు రండి.. కేసీఆర్​కు ఆహ్వానం

కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం ప్రఖ్యాత నాచారం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు (Narasimha Swamy Brahmotsavam) హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్​ (KCR)కు ఆహ్వానం అందింది. ఈ నెల 8 నుంచి 19 వరకు జరగబోయే ఉత్సవాలకు రావాలని కోరుతూ ఆలయ కమిటీ, నేతలు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికతోపాటు స్వామి వారి ప్రసాదాన్ని అందించారు. కేసీఆర్​ను కలిసినవారిలో ఆలయ చైర్మన్ రవీందర్, ఈఓ రంగాచారి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్​చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఉన్నారు. అనంతరం ఆలయ అర్చకులు కేసీఆర్​ను ఆశీర్వదించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>