కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ (One Way Traffic) అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18 వ తేదీ నుంచి పార్క్ చుట్టూ వన్ వే అమలు చేయనున్నారు. అండర్ పాస్, ఫైఓవర్ల నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నిర్మాణపనులు పూర్తయ్యేవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్, ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా వన్ వే అమలు చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు రెండు వైపులా వాహనాలకు అనుమతి ఉండగా, కేబీఆర్ పార్క్ చుట్టూ రెండు లైన్ల రోడ్లలో కేవలం ఒకే వైపు వాహనాలు ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిర్దేశిత మార్గాల్లో యూ టర్న్ లకు పోలీసులు అనుమతిండం లేదు.

