గ్రామస్థాయిలో TRSని బలోపేతం చేయండి.. పార్టీ శ్రేణులకు కవిత పిలుపు

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో టీఆర్ఎస్‌ను బలోపేతం చేయాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత (Kavitha) పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల నియమితులైన లింగంపల్లి నాగరాజు (కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి), అంకం శివరాణి (కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి) శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కవితను ప్రత్యేకంగా కలిశారు. కరీంనగర్ జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్‌తో కలిసి కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కవిత కరీంనగర్ జిల్లా నాయకులతో ముచ్చటించారు.

కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ రక్షణ సేన గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలను కలుపుకొని జిల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. పార్టీకి కార్యకర్తలే బలమని చెబుతూ.. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాలో మిగిలిన ప్రతి మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల నిర్మాణం జరగాలన్నారు.

పార్టీ ప్రవేశపెట్టిన పాంచజన్య సూత్రాలను గడపగడపకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్య, యువకులకు ఉద్యోగాలు, రైతాంగం రైతును రాజును చేసి చూపిస్తానన్నారు. ముఖ్యంగా సామాజిక తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, అందుకే కార్యకర్తలు నిత్యం ప్రజల మధ్యలో ఉండి పనిచేయాలని సూచించారు.

నూతనంగా నియమితులైన ఇన్‌చార్జ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చిన్నమల్ల చైతన్య, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీరాముల రమేశ్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, బుడిగె పర్షారం గౌడ్, బండమీద అంజయ్య, చంటి శ్రీనివాస్, మ్యాక వినోద్, బాసవేణి రాజేందర్ ముదిరాజ్, పూసాల పవన్, చింతిరెడ్డి జయపాల్ రెడ్డి, మహిళ నాయకురాలు పిన్నింటి సంగీత రెడ్డి, ఎండీ సల్మా, జంగా అపర్ణ, అతహర్, కొలిపాక గౌతమి, పొన్నం శిరీష, పల్లె శారద ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>