Mobile Popup Ad
Mobile Popup Ad

నేనూ వెబ్‌సైట్‌లో ఫ్రీ మూవీస్ చూశా : కవిత

కలం డెస్క్ : “నేను రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో ఉండగా వెబ్‌సైట్స్ వెతికి మరీ ఫ్రీ మూవీస్ చూసేదాన్ని.. ఆ తర్వాత నేను ఇండియాకు వచ్చి పాలిటిక్స్ లో యాక్టివ్ అయిన తర్వాత మానేశాను. ఇప్పుడు ఒక ప్రజా ప్రతినిధిగా కొత్త సినిమాల పైరసీ విధానానికి నేను వ్యతిరేకం”… ఐ బొమ్మ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చిట్‌చాట్ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) పై విధంగా బదులిచ్చారు.

కొత్త సినిమాలను పైరసీ చేయడం, పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టడం చట్టానికి వ్యతిరేకమని, అది నేరం కూడా అని, చట్టం ప్రకారం అలాంటి పనులు చేస్తే శిక్షను ఎదుర్కోవాల్సిందేనన్నారు. కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే… రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ(Piracy) అయ్యి కొన్ని వెబ్‌సైట్‌ల ద్వారా జనానికి చేరుతున్నదని, మనం చేసుకున్న చట్టాల ప్రకారం ఇది నేరపూరితమైన చర్య అని కవిత(Kavitha) అన్నారు.

Read Also: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి..

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>