Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ నాయకుడి హత్య కేసు: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు యావజ్జీవ శిక్ష

కలం, వెబ్​ డెస్క్​ : కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకున్నది. బీజేపీ నాయకుడి హత్య కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి (Vinay Kulkarni)తో పాటు మరో 15 మందికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2016 జూన్ 15వ తేదీన ధారవాడ జిల్లా పంచాయతీ సభ్యుడు, బీజేపీ నేత యోగేష్ గౌడ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ కాలం పాటు దర్యాప్తు జరిపిన సీబీఐ, మొత్తం 21 మందిని నిందితులుగా పేర్కొంటూ సుమారు 10 వేల పేజీల భారీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ఈ కేసును విచారించిన కోర్టు మొత్తం 21 మంది నిందితులలో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించగా, 17 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరిలో ప్రధాన నిందితుడైన ధారవాడ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణితో సహా 15 మందికి జీవిత ఖైదు పడింది. అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇన్‌స్పెక్టర్ చిన్నకేశవకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో ప్రజాప్రతినిధులకు రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వారు తమ పదవికి అనర్హులు అవుతారు. ఈ నేపథ్యంలో కోర్టు యావజ్జీవ శిక్ష విధించడంతో వినయ్ కులకర్ణి (Vinay Kulkarni) తన ఎమ్మెల్యే పదవిని కోల్పోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>