ఆ ముగ్గురి ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి: అంబటి

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నిరాహార దీక్ష ప్రారంభించారు. తన ఇల్లు, ఆఫీసు మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కస్టడీ లో తనను హింసించిన రాష్ట్ర పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం 6 గంటల నుంచి దీక్ష చేపట్టారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. తన ఇంటిపై దాడి చేసి తననే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని అంబటి మండిపడ్డారు.

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు. నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్ పై చర్యలు లేవు. దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>