కలం, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం డీకే.శివకుమార్ (DK Shivakumar) బెంగళూరులో మెట్రోలో ప్రయాణించారు. పెట్రోల్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా.. తన కాన్వాయ్‌ను వదిలిపెట్టి విధాన సౌధ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మెట్రో ఎక్కిన ముఖ్యమంత్రిని చూసి.. ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. వారికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ సరదాగా మాట్లాడారు. కొందరు చిన్నారులకు చాక్లెట్లు కూడా ఇచ్చారు. సీఎంతో పలువురు సెల్ఫీలు దిగారు. తన కాన్వాయ్ సంఖ్యను కుదించాలని సీఎం డీకే.శివకుమార్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించి ప్రజలకు అవగాహన కల్పించారు.

