Mobile Popup Ad
Mobile Popup Ad

​కరీంనగర్‌లో ఘనంగా ముగిసిన ‘యూత్ అండ్ స్పోర్ట్స్, టూరిజం’ వారోత్సవాలు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న “యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్”, “టూరిజం వీక్” వేడుకలు శనివారంతో ఘనంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

​​వారోత్సవాల ముగింపు రోజైన 6వ రోజున “Udyoga Sadhana- Connecting Talent with Opportunities” అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో ఉదయం రెండవ ఎడిషన్ ‘సీఎం కప్’ విజేతలను ఘనంగా సన్మానించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి (DYSO) శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి, కరీంనగర్ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ద రెడ్డి, సెక్రటరీ రామకృష్ణ, వుషు సెక్రటరీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>