కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్‌లో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (MT) విభాగానికి ఇటీవలే అధునాతన సాంకేతిక పరికరాలు వచ్చాయి. సీపీ గౌష్ ఆలం గురువారం రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. పోలీస్ వాహనాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ‘టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్’, 3 HP కంప్రెషర్‌తో కూడిన టైర్ ఛేంజర్ టూల్ పనితీరు అడిగి తెలుసుకున్నారు. కొత్త పరికరాలతో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ గ్యారేజ్‌లో మెకానిక్‌లకు వాహనాల రిపేరింగ్ మరింత సులభతరం అవుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో సమయం ఆదా అవ్వడమే కాకుండా, పోలీస్ వాహనాలు ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంటాయన్నారు. గ్యారేజ్ నిర్వహణ, వాహనాల భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు మేడ కిరణ్ కుమార్, రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

