కరీంనగర్‌లో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు

కలం, కరీంనగర్ బ్యూరో: బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిన్న రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన ఈ తనిఖీలను పోలీస్ కమిషనర్ (CP) గౌష్ ఆలం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. మొత్తం 1,479 వాహనాలను తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 48 మందిపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని 60 వాహనాలను గుర్తించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 115 చలానాలు విధించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని, తనిఖీలకు నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>