కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధి చింతకుంటలో గత పది సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న 668 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వాస్తవ పరిస్థితిని కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, పేదలకు ఇండ్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తూనే, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించిన తర్వాతే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇండ్ల సముదాయాల వద్ద రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, తాగునీరు, లిఫ్టులు, విద్యుత్ కనెక్షన్లు వంటి అన్ని మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించిన తర్వాత మాత్రమే లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలన్నారు. గతంలో తాను నగరపాలక సంస్థలో మేయర్‌గా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ ఆలోచన మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌలిక వసతుల కోసం రూ. 4 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్టు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్స్ పనులను పూర్తి చేయడానికి మౌలిక వసతుల సదుపాయాల కోసం ఇంకా 20 నుంచి 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి అన్ని మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలన్నారు.
ఆరు అంతస్తుల భవనాల్లో నివసించే వారికి ఒక్క లిఫ్ట్ ఏమాత్రం సరిపోదని, తప్పనిసరిగా ప్రతి బ్లాక్‌కు రెండు లిఫ్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. పేద ప్రజలు లిఫ్టులు, భవన నిర్వహణ ఖర్చులు భరించే స్థితిలో ఉండరు కాబట్టి, ప్రభుత్వం లేదా నగరపాలక సంస్థ ఒక ‘కార్పస్ ఫండ్’ ఏర్పాటు చేసి, రాబోయే 5 సంవత్సరాల పాటు లిఫ్ట్, ఇతర నిర్వహణ బాధ్యతలు చూడటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో పేదల కోసం ‘క్యూర్’ (CURE) పద్ధతిలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామన్న ఆలోచన తరహాలోనే, కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కూడా అమలు చేయాలన్నారు.
కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దాదాపు 30 వేల నుంచి 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. సొంత స్థలం ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి, సొంత స్థలం లేని నిరుపేదలకు ఎలాంటి ఇండ్లు ఇవ్వకపోవడం చూస్తే పేద ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. వెంటనే సొంత జాగా లేని పేదల కోసం నగరానికి దగ్గరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు (డబుల్ బెడ్రూమ్ ఇండ్లు) నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లా యంత్రాంగం డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేయాలని యాదగిరి సునీల్ రావు కోరారు. బలహీన వర్గాల పేద ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఇళ్లు అలాట్మెంట్ చేయాలని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల వరకు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక అధికారిని నియమించి, కార్పస్ ఫండ్ ద్వారా లిఫ్ట్, ఇతర మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపైనే ఉందని సూచించారు.
వెంటనే సొంత జాగా లేని పేదల కోసం నగరానికి దగ్గరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు (డబుల్ బెడ్రూమ్ ఇండ్లు) నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేయాలని యాదగిరి సునీల్ రావు కోరారు.
బలహీన వర్గాల పేద ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ఇళ్లు అలాట్మెంట్ చేయాలని స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల వరకు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక అధికారిని నియమించి, కార్పస్ ఫండ్ ద్వారా లిఫ్ట్, ఇతర మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపైనే ఉందని సూచించారు.

