సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలి: సీపీ గౌష్ ఆలం

కలం, కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, సిటిజన్ ఫీడ్‌బ్యాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పరిశీలించిన సీపీ, CCTNS, e-సాక్ష్య (e-Saksya), సమన్వయ (Samanvaya) వంటి సాంకేతిక పోర్టల్స్, అప్లికేషన్ల పనితీరును సమీక్షించారు. నేర పరిశోధన, రోజువారీ పోలీసింగ్‌లో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలో ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తితో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>