అసమానతలు లేని సమాజం కోసం యువత పోరాడాలి: యుగంధర్

కలం, కరీంనగర్: భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులు షహీద్ భగత్‌సింగ్‌ పోరాట స్పూర్తితో మతోన్మాద, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా అసమానతలు లేని సమాజ నిర్మాణానికి యువత ముందుకు సాగుతూ ఉద్యమించాలని, ఏఐవైఎఫ్ కరీంనగర్ (Karimnagar AIYF) జిల్లా కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 119వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బోయవాడలో గల భగత్ సింగ్ విగ్రహానికి ఏఐవైఎఫ్ నాయకులు పూలమాలవేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా పోరాడి, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తూ బ్రిటిషర్ల ఉరికంబాన్ని ముద్దాడి అమరత్వం పొందిన విప్లవ ధృవతార షహీద్ భగత్ సింగ్ అని కొనియాడారు. వారి పోరాట స్పూర్తితో నేటి సమాజంలో అసమానతలపై, అందరికీ సమాన హక్కులకై, మతోన్మాదంపై, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా, దోపిడి, పీడన, అణిచివేత, కులమత భేదం లేని సమ సమాజ స్థాపనకై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబోసుల సంతోష్ చారి, ఉపాధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్, పినమల్ల విజయభాస్కర్, నగర సహాయ కార్యదర్శి జువ్వాజి తిరుపతి, జహీర్ ఖాన్,వర్ధన్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>