ప్రోటీన్ వాడకంపై కంగనా కామెంట్స్.. డాక్టర్లు ఏమన్నారంటే!

కలం, వెబ్ డెస్క్: ‘ఎక్కువ ప్రోటీన్ మనిషిని తెలివి తక్కువవాడిగా చేస్తుంది’ అని ఇటీవల కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ప్రోటీన్ షేక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ పక్కన పెట్టి సంప్రదాయ భారతీయ ఆహారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు. కొన్ని దేశాలతో పోలిస్తే క్యాన్సర్ కేసులు తక్కువగా ఉండటానికి ఇక్కడి ఆహారపు అలవాట్లే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కంగనా పోస్టులపై డాక్టర్లు రియాక్ట్ అయ్యారు.

కండరాల నిర్మాణం, కణజాల మరమ్మతు, రోగనిరోధక శక్తికి ప్రోటీన్ కీలకమైన పోషకమని నిపుణులు పేర్కొన్నారు. కేవలం ప్రోటీన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రావడం గానీ, తెలివి తక్కువవారు కావడం గానీ జరగదని శాస్త్రీయ ఆధారాలు నిరూపిస్తున్నాయి. జన్యుపరమైన అంశాలు, వయస్సు, జీవనశైలి, ధూమపానం, మద్యపానం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, పర్యావరణ కారకాల కలయిక వల్ల క్యాన్సర్ వస్తుందన్నారు. కేవలం ప్రోటీన్‌ను మాత్రమే తప్పుపట్టడం సరికాదని వైద్యులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>