పగ మరిచి.. పాలు పంచుకున్న కుక్క, పిల్లి!

​కలం, ఖమ్మం బ్యూరో : కుక్క, పిల్లి.. ఎదురు పడితే చాలు..రణరంగమే! కానీ, వాటి నైజానికి భిన్నంగా ఆ రెండు జంతువులు పెంచుకున్న బంధం ఇప్పుడు ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ అరుదైన దృశ్యం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్దారం (Buddharam)లో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మెల్లచెరువు లచ్చయ్య అనే రైతు ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు.

దాని వద్దకు ఒక పిల్లి ఎలాంటి భయం లేకుండా రావడమే కాకుండా, రోజురోజుకు ఎంతో దగ్గరైంది. ఇప్పుడు ఏకంగా కుక్క వద్దనే పిల్లి హాయిగా పాలు తాగుతూ తన ఆకలి తీర్చుకుంటోంది. కుక్క పిల్లిని భయపెట్టకుండా అక్కున చేర్చుకోవడం చూసి లచ్చయ్య కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారు.

మనుషులకు సైతం సందేశం..

శత్రుత్వాన్ని మరిచి ఆ రెండు జంతువులు దగ్గరైన తీరుని.. వాటి మైత్రిని చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. ​ప్రస్తుతం సమాజంలో మనుషుల మధ్య స్వార్థం, చిన్న చిన్న విషయాలకే వైషమ్యాలు పెరుగుతున్న నేటి కాలంలో ప్రకృతి వైరాన్ని సహితం జయించి జీవిస్తున్న ఈ కుక్క, పిల్లుల అనుబంధం ప్రతి ఒక్కరికీ ఒక పాఠంలా నిలుస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బుద్ధారం(Buddharam)లో ఈ అరుదైన స్నేహబంధం చూపరులను ఆకట్టుకుంటోంది.

Also Read : కాంగ్రెస్‌లో కొనసాగింపు.. కొండా దంపతుల కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>