Mobile Popup Ad
Mobile Popup Ad

కల్కి 2 : రెండు డిఫరెంట్ లుక్స్‌లో కమల్ హాసన్

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ” “కల్కీ పార్ట్ 2″(Kalki 2). స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ‘కల్కి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కల్కి సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలో నటించారు.

సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. సినిమా చివరిలో కనిపించినా అద్భుతంగా నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఫిబ్రవరి చివరి వారంలో కల్కి పార్ట్ 2 షూటింగ్ మొదలు కానుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కమల్ పాత్ర ఈ సారి 90 నిముషాలకు పైనే ఉంటుందని సమాచారం. అంతేకాకుండా కమల్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>