కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ చందమామగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన అప్‌కమింగ్ మూవీ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ అయ్యింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. NBK111 వర్కింగ్ టైటిల్‌తో ట్రెండ్ అవుతున్న ఈ మూవీలో కాజల్ పాత్రపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ రోజు రిలీజైన పోస్టర్లో కాజల్ సారీలో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చింది. పోస్టర్ చూస్తుంటే కాజల్ ఎన్నడూ ట్రై చేయిన జోనర్ ట్రై చేసిందని తెలుస్తోంది. కాజల్ లేడీ డాన్ క్యారెక్టర్ చేస్తోందని కొందరు, ఐఏఎస్ ఆఫీసర్ రోల్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత కాజల్ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

