కడ్తాల్‌లో ఇంటింటి జ్వర సర్వే..సీజనల్ వ్యాధులపై అలర్ట్

కలం, సోన్: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే(Fever Survey) నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించారు. అవసరమైన మందులు అందజేశారు. చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పాత టైర్లు, కూలర్లు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సాయినాథ్, ఆశా వర్కర్లు సరోజ, సుజాత, రాధా, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>