చిన్నారుల రాఖీ వేడుకల్లో తాహెర్‌ సందడి

కలం, నిర్మల్‌: తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్‌ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బీన్‌ హమ్దాన్ (Taher Bin Hamdan) అన్నారు. గురువారం సోన్‌ మండలం కడ్తాల్‌ (Kadthal) గ్రామంలో వేదిక్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు తాహెర్‌ బీన్‌ హమ్దాన్‌కు  రాఖీలు కట్టి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల ఆత్మీయతకు స్పందించిన ఆయన వారికి కానుకలు అందజేశారు. రక్షాబంధన్‌ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గుర్రం రాము, నిర్మల్‌ ఏఎంసీ చైర్మన్‌ సోమా భీంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులు గాజుల రవికుమార్‌, శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయ చైర్మన్‌ కొట్టే శేఖర్‌, కాంగ్రెస్‌ పార్టీ సోన్‌ మండల అధ్యక్షుడు మోహినొద్దీన్‌, గ్రామ కార్యదర్శి సుమయ తస్కిన్‌, పాఠశాల కరస్పాండెంట్‌ మామిల్ల లింగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>