బుద్ధవనం మహా అద్భుతం: జస్టిస్ సామ్ కోషి

కలం, నాగార్జున సాగర్: నాగార్జునసాగర్‌లోని బుద్దవనం మహా అద్భుతమని, ఒకసారి చూస్తే మర్చిపోలేని బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి (Justice Sam koshy) ప్రశంసించారు. శుక్రవారం నాగార్జునసాగర్‌లో పర్యటించారు. మొదట విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న న్యాయమూర్తి దంపతులకు నిడమనూరు కోర్టు న్యాయమూర్తి పృథ్వీరాజ్ పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.

బుద్ధవనం పరిశీలన..

బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధుడి పాదాల వద్ద జస్టిస్ సామ్ కోషి పుష్పాంజలి ఘటించారు. బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూప వనాలను ఆసక్తిగా చూశారు. అనంతరం మహాస్తూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్దవనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. మహా స్తూపం ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించిన అనంతరం బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర బుద్ధ వనం కండువాలతో, బ్రోచర్లతో న్యాయమూర్తిని సత్కరించారు. టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ డ్యామ్ వివరాలను, బుద్దవనం విశేషాలను వివరించారు. సాగర్ ఎస్ఐ సతీష్, ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ గురునాథం, కోర్టు సిబ్బంది ఖాళీక్ తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>