హండ్రెడ్ షెడ్యూల్‌పై ఈసీబీ షాకింగ్ కామెంట్స్

కలం, స్పోర్ట్స్: ‘ది హండ్రెడ్’ షెడ్యూల్‌పై వస్తున్న విమర్శలకు ఈసీబీ (ECB) ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇబ్బంది కలిగిస్తున్నా.. దాని వల్ల వచ్చే ప్రయోజనాల కోసం ఈ త్యాగం చేయాల్సిందేనని పేర్కొన్నారు. 2026 ‘ది హండ్రెడ్’ ఆగస్టు 16న ముగిసింది. ఆ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య తొలి టెస్ట్ మొదలైంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లకు విశ్రాంతి, ఫార్మాట్ మార్చుకునే సమయం చాలా తక్కువగా దొరికింది. ఈ షెడ్యూల్‌పై ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఆటగాళ్లపై ప్రభావం..

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ కూడా షెడ్యూల్ వలన ఆటగాళ్లపై ప్రభావం పడుతోందని పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి హండ్రెడ్‌లో బౌలింగ్ చేసిన ఆటగాడు.. బుధవారం టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి వస్తోందని హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పాడు. అయితే ఈసీబీ ఛైర్మన్ థాంప్సన్ మాత్రం ది హండ్రెడ్ వలన ప్రయోజనాలను గుర్తు చేశారు. గతేడాది హండ్రెడ్‌లోని ఎనిమిది జట్లలో వాటాలను విక్రయించడం ద్వారా ఈసీబీ సుమారు 500 మిలియన్ పౌండ్లు సమీకరించిందన్నాడు.

త్యాగాలు తప్పవు..

ఇలా సమకూరిన నిధులను దేశవాళీ, ప్రొఫెషనల్ క్రికెట్ కోసం ఉపయోగించారు. క్రికెట్‌లోని అప్పులను తగ్గించుకోవడం, కౌంటీ జట్లకు కొత్త అవకాశాలు కల్పించడం వంటి ప్రయోజనాల కోసం షెడ్యూలింగ్‌లో కొన్ని త్యాగాలు తప్పవని థాంప్సన్ స్పష్టం చేశారు. అయితే ది హండ్రెడ్ ముగిసిన వెంటనే టెస్ట్ మ్యాచ్ పెట్టడంపై వచ్చిన విమర్శలను కూడా ఆయన అంగీకరించారు. భవిష్యత్తులో హండ్రెడ్ ముగిసిన తర్వాత అంతకంటే తక్కువ సమయం ఉంటే మాత్రం అది సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>