ఎన్టీఆర్ ఇంట్లో జ‌పాన్ అతిథులు.. ఫోటోలు వైర‌ల్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే డ్రాగ‌న్ గ్లింప్స్ విడుద‌ల చేసిన తార‌క్‌.. అదే స‌మ‌యంలో త‌న ఇంట్లోకి కొత్త‌గా వ‌చ్చిన ఇద్ద‌రు జ‌పాన్ అథితుల‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశాడు. రెండు స‌రికొత్త జ‌పాన్ ప‌క్షుల‌ను త‌న నివాసానికి తీసుకొచ్చిన ఆయ‌న వాటికి సంబంధించిన ఫోటోల‌ను ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

త‌న‌పై జ‌పాన్ ప్రేక్ష‌కులు చూపిస్తున్న ఆద‌రాభిమానాల‌కు గుర్తుగా ఎన్టీఆర్ ఈ ప‌క్షుల‌కు జ‌ప‌నీస్ పేర్ల‌నే పెట్ట‌డం విశేషం. వాటిలో ఒక దానికి యూహీ , మ‌రొక దానికి అసాహి అని పేరు పెట్టారు. తార‌క్‌ ఈ ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. నా బ‌ర్డీస్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాను.. జ‌పాన్‌పై నాకున్న ప్రేమ‌కు ఇవి ప్ర‌తిరూపాలు .. అంటూ ఎమోష‌న‌ల్ క్యాప్ష‌న్‌ను జ‌త చేశాడు. త‌న పుట్టిన రోజున డ్రాగ‌న్ గ్లింప్స్‌తో పాటు ఈ క్యూట్ ప‌క్షుల ఫోటోలు కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో తార‌క్‌ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక జ‌పాన్ అభిమానులు సైతం తార‌క్ స్పెష‌ల్ పోస్టుకు ఫిదా అయిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>