6 గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయి? కామారెడ్డిలో బీఆర్ఎస్ నిరసన

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన (BRS Protest) చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు చేయని 6 గ్యారంటీలు, 420 హామీ పత్రాలను చించివేసి కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలు వీటిని గమనించాలని కోరారు. తిరిగి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>