కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా తూప్రాన్ (Tupran) మండల పరిధిలోని నర్సంపల్లి అటవీ ప్రాంత సమీపంలో అక్రమ భూమి చదును కలకలం రేపింది. నర్సంపల్లి గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు రెండు ఎకరాల అడవి భూమిని జేసీబీ (JCB) యంత్రాల సహాయంతో అక్రమంగా చదును చేశారు.
విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. భూమిని చదును చేయడానికి ఉపయోగిస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ అక్రమ భూ ఆక్రమణకు పాల్పడిన నర్సంపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులపై అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

