హీటెక్కిస్తున్న తమిళనాడు పాలిటిక్స్.. త్రిష మరో శశికళ కానుందా!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఒకవేళ అక్కడ హంగ్‌ ఫలితాలు వస్తే.. నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కీలకంగా మారనున్నాడు. అయితే రాజకీయ ప్రస్థానంపైనే కాకుండా ఆయనకు సన్నిహితురాలిగా భావించే నటి త్రిష కృష్ణన్ పాత్రపై కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై అనేక రూమర్స్ వచ్చాయి. ఇద్దరు ఆ వార్తలను ఖండించలేదు. విజయ్ ఒకవేళ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటే, త్రిష (Trisha) తెర వెనుక ఒక శక్తివంతమైన నాయకురాలిగా ఎదుగుతారా అనే ప్రశ్న ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొందరు నెటిజన్లు ఈ పరిణామాలను దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి వి.కె. శశికళల అనుబంధంతో పోలుస్తున్నారు. జయలలిత హయాంలో శశికళ ఏ విధంగానైతే కీలక నిర్ణయాల్లో తన ప్రభావం చూపారో, ఒకవేళ విజయ్ ప్రభుత్వం ఏర్పడితే.. త్రిష కూడా అలాంటి పాత్రనే పోషిస్తారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఈ చర్చలు కేవలం సరదాగా సాగుతున్న ఊహాగానాలే తప్ప, వీటి వెనుక ఎటువంటి అధికారిక సమాచారం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడులో సినిమా, రాజకీయం ఎప్పుడూ విడదీయలేని భాగాలుగా ఉంటూ వస్తున్నాయి. విజయ్‌తో కలిసి త్రిష పలు బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం ప్రజల్లో ఆసక్తినిరేపింది. రాజకీయాల్లో ఆమెకు ఏదైనా పదవి దక్కుతుందా లేదా అనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. విజయ్ రాజకీయ భవిష్యత్తు, త్రిష పాత్రపై కొనసాగుతున్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>