వరిధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి (Akberpet-Bhoompally) మండలం కేంద్రంలోని చౌరస్తా వద్ద NH-765G హైవే రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేడ్ల పేరుతో అధికారులు రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్‌లో సరైన సదుపాయాలు కల్పించాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ధాన్యం కల్లాల్లోనే కుప్పలుగా పడి ఉన్నాయని, అకాల వర్షాలకు తడిసి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, మద్ధతు ధర కోసం పడిగాపులు కాస్తున్నామని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>