ఆ దేశాల మధ్య సీజ్ ఫైర్.. ట్రంప్ సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో శాంతి దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 10 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ప్రకటించారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని వెల్లడించారు. వాషింగ్టన్ లో ఇరు దేశాల ప్రతినిధులతో శాంతి చర్చలు జరిపినట్లు వివరించారు.

ఈ సందర్భంగా వాషింగ్టన్ లో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ కావడాన్ని ఒక చారిత్రక విజయంగా ట్రంప్ అభివర్ణించారు. శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాల అధినేతలు గొప్ప సాహసం చేశారని కొనియాడిన ట్రంప్.. గత 34 ఏళ్లలో ఇజ్రాయెల్ , లెబనాన్ దేశాల నేతలు ఇలా ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. ఈ 10 రోజుల సీజ్ ఫైర్ ఒక శాశ్వత శాంతి ఒప్పందానికి పునాది కాబోతోందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు తన దౌత్య నీతి ద్వారా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది యుద్ధాలను ఆపానని, ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ తాను ఆపిన పదో యుద్ధం కాబోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>