Mobile Popup Ad
Mobile Popup Ad

ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్​పై వేటు

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పై వేటు పడింది(Sangareddy). ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి చైర్మన్ ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్​కు మద్దతు ఇచ్చిన 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం రద్దయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విప్ ధిక్కరణ ఫిర్యాదుపై విచారణ జరిపి మాధవిపై అనర్హత వేటు వేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. ఇస్నాపూర్ మునిసిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీ తీవ్ర పోటీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది.. ఎక్స్ అఫిషియో మెంబర్ గా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మద్దతులో బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం సాధించింది. అనైతిక పొత్తుతో కాంగ్రెస్ పార్టీని ఓడించారని..ఎప్పటికైనా ధర్మానిదే విజయం అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>