epaper
Wednesday, March 4, 2026
epaper

హోలీ వేళ విషాదం.. యాక్సిడెంట్ లో ముగ్గురి మృతి

కలం, జనగామ : హోలీ పండగ వేళ జనగామ (Jangaon) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ పైన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠి దినేష్(23), బాల్దే భనుష్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్ అండ్ బి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై నుంచి నెహ్రూ పార్కు వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని బైక్ పై వస్తున్న దినేష్, బాల్దే భనుష్ ఎదురుగా ఢీకొట్టారు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దినేష్ పట్టణంలోని జ్యోతి నగర్ కు చెందిన వ్యక్తి కాగా.. భనుష్ ది వడ్లకొండ గ్రామం. బొలెరో వాహనం డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పెంబర్తి వద్ద..

జనగామ (Jangaon) జిల్లా పెంబర్తి వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన అజ్మీర గణేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గణేష్ మంగళవారం హైదరాబాద్ నుండి స్వగ్రామానికి బైక్ పై వస్తుండగా హైవే మీద పెంబర్తి కోళ్ల ఫాం వద్ద వెనకాల నుండి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!