‘ఇరుముడి’ జాతరకు ముహూర్తం ఫిక్స్!

కలం, సినిమా : మాస్ మహారాజా రవితేజ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ” ఇరుముడి” (Irumudi). టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో శక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఆగష్టు 21, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

తాజాగా చిత్ర బృందం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ (Mallepoola Pallaki) పాట విడుదలతో పాటు ఇరుముడి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 16న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ఘనంగా జరగనుంది. మేకర్స్ విడుదల చేయనున్న ‘మల్లెపూల పల్లకి’ పాట మరింత భక్తి భావాన్ని ప్రతిబింబించేలా ఉండబోతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పాటతో సినిమాపై మరింత హైప్ ఏర్పడే అవకాశముంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>