కలం, స్పోర్ట్స్: ఐరిష్ రన్నింగ్ స్టార్, యూరోపియన్ 1,500 మీటర్ల ఛాంపియన్ సియారా మెగీన్ (Ciara Mageean) క్యాన్సర్‌తో పోరాడుతూ 34 ఏళ్ల వయస్సులోనే ఆదివారం ఉదయం కన్నుమూశారు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. తన కెరీర్‌లో 2016లో కాంస్యం, 2022లో వెండి పతకాలు గెలుచుకున్నారు. 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా వెండి పతకం సాధించారు. 2024 రోమ్ యూరోపియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి కెరీర్‌లో అత్యుత్తమ శిఖరానికి చేరారు. అయితే 2024 పారిస్ ఒలింపిక్స్ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత 2025 జులైలో తనకు నాలుగో దశ ప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు ఆమె వెల్లడించారు. దాదాపు ఏడాది కాలంగా వ్యాధితో పోరాడిన ఆమె, నవంబర్ 1 ఆదివారం ఉదయం 6:30 గంటలకు కుటుంబ సభ్యుల మధ్య తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఖాతా ద్వారా కుటుంబ సభ్యులు ప్రకటించారు. చివరంటా ధైర్యంగా పోరాడిన ఒక గొప్ప క్రీడాకారిణిగా ఆమెను గుర్తుంచుకుంటామని అథ్లెటిక్స్ ప్రపంచం నివాళులు అర్పిస్తోంది.

